28, జులై 2017, శుక్రవారం

ఒడిశాలోని వీలర్‌ ఐలాండ్‌కు అబ్దుల్‌ కలాం పేరు

ఒడిశాలోని వీలర్‌ ఐలాండ్‌కు అబ్దుల్‌ కలాం పేరు


                ఒడిశా తీరంలోని వీలర్‌ దీవికి (ఐలాండ్‌) ఆ ఒడిశా సీఎం నవీన్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు పెట్టింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి గురువారం కేంద్రం ఆమోదం తెలపగా.. ఆ వెంటనే రాష్ట్ర రెవెన్యూశాఖ గెజిట్‌ విడుదల చేసింది. అబ్దుల్‌ కలాం క్షిపణి శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో ఒడిశాలోని భద్రక్‌ జిల్లా చాంద్‌బలి ప్రాంతంలోని క్షిపణుల ప్రయోగశాలను పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలోనే ఇక్కడి బంగాళాఖాతంలో వీలర్‌ దీవిని గుర్తించి.. క్షిపణి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అనంతరం ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ మిస్సైల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి